భజనలో గాయకుల గానామృతానికి నోట్లవర్షం

Money is gifted to Traditional Music during a Ritual

10:53 AM ON 27th December, 2016 By Mirchi Vilas

Money is gifted to Traditional Music during a Ritual

ఈమధ్య వాంప్ డ్యాన్స్ లలో డాన్సర్ లపై నోట్ల వర్షం కురిపించడం వింటున్నాం. కానీ ఇప్పుడు సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యాక్రమంలో కూడా గాయకుల గానామృతానికి పరవశించి జనం నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్ లో ఓ భజన కార్యక్రమంలో అభిమానులు ఇలా చేసారు. నవ్ సరాయ్ లో నిర్వహించిన ఓ అధ్యాత్మిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఇందుకు వేదికైంది. భజన కార్యక్రమంలో తమ గాత్రంతో శ్రోతల్ని కట్టిపడేసిన జానపద గాయని సహా కళాకారులపై నోట్ల వర్షాన్ని కురిపించారు. గాయనీ, గాయకుల గానామృతంలో తడిసిముద్దైన నిర్వాహకులు రూ. 40లక్షల విలువైన కరెన్సీ నోట్లను వెదజల్లి వారిని అభినందించారు. నోట్ల రద్దుతో చిల్లర కోసం ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు సుమారు రూ.40లక్షల విలువైన రూ.10, రూ.20నోట్లను కళాకారులపై వెదజల్లడం చర్చనీయం అయింది. ఇక ఆ వీడియో పై మీరూ లుక్కెయ్యండి.

English summary

During a ritual music in Gujarat, Some people sprinkled money on musician. it is very different which is never happened with traditional music