ఎటిఎం ల నుంచి 87 కోట్లు పైగా చోరీ 

Money robbery from 1400 ATM Machines

01:01 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Money robbery from 1400 ATM Machines

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎంత టెక్నాలజీ వచ్చినా, చోరులకు వారి పద్దతులు వారికున్నాయి. లేకుంటే ఓ మహానగరం లో అందునా అభివృద్ధి చెందిన దేశంలో భారీ చోరీ చేసేసారు. ఇదో మహా మోసం.. అవును ఇది భారీ దొంగతనం.. వేలు, లక్షల రూపాయలు కాదు.. ఏకంగా 13 మిలియన్‌ డాలర్లను దోచుకున్నారు. అంటే భారత కరెన్సీలో ఈ విలువ రూ. 87కోట్లకు పైమాటే మరి. అదీ కూడా కేవలం రెండు గంటల సమయంలో 1400 ఏటీఎం మిషన్ల నుంచి కొల్లగొట్టారు. ఫోర్జరీ చేసిన క్రెడిట్‌ కార్డుల సాయంతో డబ్బంతా దోచుకెళ్లారు. జపాన్‌ దేశంలో ఈనెల 15న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మే 15న జపాన్‌ రాజధాని టోక్యో సహా, కంగావా, ఐచీ, ఒసాకా, ఫుకోకా తదితర 16 ప్రాంతాల్లోని 1400 ఏటీఎంల నుంచి ఫోర్జిడ్‌ క్రెడిట్‌ కార్డుల సాయంతో 1.44 బిలియన్‌ యెన్‌ల కరెన్సీని(13 మిలియన్‌ డాలర్లు) దొంగతనం చేశారు. కేవలం రెండు గంటల సమయంలోనే ఈ దొంగతనం జరిగింది. చోరీ జరిగిన ఒక ఏటీఎంకు చెందిన బ్యాంకు.. తమ రికార్డులను పరిశీలించగా.. ఫోర్జరీ క్రెడిట్‌ కార్డుల గురించి తెలిసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


అంతర్జాతీయ క్రిమినెల్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన 100మందికి పైగా దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. వారంతా ఒకరితో మరొకరికి సంబంధం ఉన్నవాళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోర్జ్‌డ్‌ డేటా వివరాల ప్రకారం.. ఆ క్రెడిట్‌ కార్డులు దక్షిణాఫ్రికాకు చెందిన ఓ బ్యాంకు నుంచి జారీ అయినట్లు తెలిసింది. హ్యాకింగ్‌ లేదా ఇతర పద్ధతుల ద్వారా క్రెడిట్‌ కార్డుల వివరాలను తెలుసుకుని, ఫోర్జరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయమై దక్షిణాఫ్రికా అధికారులతో చర్చిస్తున్నారు. ఏటీఎంలలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కెమెరాల ద్వారా వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

English summary

Money robbery from 1400 ATM Machines.