పతకం రాలేదని బట్టలు విప్పేసారు (వీడియో)

Mongolian wrestling coaches protest at result in Rio Olympics

11:01 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Mongolian wrestling coaches protest at result in Rio Olympics

గెలిచే ఛాన్స్ వున్నా కొందరు అత్యుత్సాహంతో మిస్ చేసుకుంటారు. ఆ తర్వాత భోరున ఏడుస్తారు. సరిగ్గా ఒలింపిక్స్ లో ఇలానే జరిగింది. ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ కాంస్య పతక పోటీ ముగింపు దశలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఈ పోరులో మంగోలియా రెజ్లర్ గాంజోరిజిన్.. ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇక్తియోర్ తో తలపడ్డారు. ఐతే ఇంకొన్ని క్షణాల్లో బౌట్ ముగుస్తుందనగా ఆధిక్యంలో ఉన్న గాంజోరిజిన్ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రత్యర్థితో తలపడటం మానేసి, పరుగులు పెడుతూ సంబరాల్లో మునిగిపోయాడు. అంతలోనే అతడి కోచ్ లు ఇద్దరూ రింగ్ లోకి వచ్చేసి అతడితో జత కలిశారు. ఐతే పోటీ ముగియకుండానే సంబరాలు చేసుకున్నందుకు అతడికి పెనాల్టీ పడింది. అతడి ప్రత్యర్థి ఇక్తియోర్ ను 8-7తో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో గాంజోరిజిన్, అతడి కోచ్ లు నైరాశ్యంలో మునిగిపోయారు. జడ్జీల నిర్ణయాన్ని నిరసిస్తూ కోచ్ లు ఇద్దరూ బట్టలు విప్పేశారు. తర్వాత బోరున విలపించారు. గాంజోరిజిన్ రిఫరీ విజేతను ప్రకటించే సమయంలో పక్కన నిలబడేందుకు కూడా ఇష్టపడలేదు. మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేశాడు. గట్టిగా విలపించాడు. అతడిపై నిషేధం పడుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ సైట్ ఓపెన్ చేస్తే చాలు జైలు... 3 లక్షల జరిమానా!

ఇవి కూడా చదవండి:ఆంధ్రాలో జనాభా కన్నా మొబైల్స్ ఎక్కువట

English summary

Mongolian Wrestler and his coaches stripped their clothes and made protest on Judges Judgement in Rio Olympics. The reason is that Mongolian Wrestler started his celebrations without the time has completed. Due his act judges had announced other player as the winner.