సోడా మిక్స్ చేసి ... రక్తం తాగేస్తున్నారు!

Monitor Lizard was Killed To Drink Its Blood

11:25 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

Monitor Lizard was Killed To Drink Its Blood

వాడిది ఉడుంపట్టురా అంటుంటారు కదా.. ఇలా ఎందుకంటారంటే, ఉడుం పట్టు అలాంటిది మరి. ఛత్రపతి శివాజీ సైన్యం కోటగోడలు ఎక్కడానికి ఈ ఉడుములకు తాడుకట్టి, వాటిని ఆ గోడ మీదకు విసిరి.. దాని పట్టుతో తాడు పట్టుకుని పైకి ఎక్కేవారట. అంటే మనిషి బరువును కూడా తట్టుకుని పటిష్ఠంగా కోటగోడను పట్టుకోగల సామర్థ్యం ఉడుములకు ఉంటుందన్న మాట. అయితే అలాంటి ఉడుములను ఇప్పుడు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడులో అయితే.. ఆ ఉడుము సామర్థ్యం తమకు రావాలని చాలామంది తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే అంశం కొందరు వ్యాపారులకు కలిసొచ్చింది. వాళ్లు ఉడుముకు ఎంత బలం ఉందో అది మీకు కూడా రావాలంటే తమవద్దకు రావాలని ప్రచారం చేస్తున్నారు.

ఉడుము రక్తం తాగితే నరాల్లో పటుత్వం పెరుగుతుందని, తమ సామర్థ్యం రెట్టింపు అవుతుందని నమ్మకం ఉండటంతో వాళ్లు దీనికోసం ఎగబడుతున్నారని అంటున్నారు. అందుకే అక్కడకు వచ్చినవారికి ఉడుమును చంపి, దాని రక్తాన్ని ఒక గ్లాసులో సగం వరకు నింపి ఇస్తున్నారు. అలా వచ్చినవాళ్లు కూడా మిగిలిన సగం గ్లాసులో సోడా కలుపుకొని, ఆ రక్తాన్ని ఏదో కూల్ డ్రింకో, మద్యమో తాగినంత సులభంగా తాగేస్తున్నారు. వ్యాపారులు ఉడుములను ఎక్కడినుంచి తెస్తున్నారో గానీ.. అక్కడికక్కడే వాటిని కోసి, రక్తం తీసి గ్లాసుల్లో పట్టి ఇస్తున్నారు. కస్టమర్లు కూడా అందులో సోడా కలుపుకొని తాగేసి, తెగ సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: కైలాస పర్వతంపై శివుని ఆనవాళ్లు ... బయటపెట్టిన నాసా ... (వీడియో)

ఇవి కూడా చదవండి:ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

English summary

Tamilnadu was known for his traditions and in a place in Tamilnadu state some of the people used to drink Monitor Lizard blood by killing it. They believed that by drinking of Monitor Lizard blood they will get energy.