బస్సు నడిపింది - హడలుగొట్టింది. ....

Monkey Drives Bus In UttarPradesh

12:28 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Monkey Drives Bus In UttarPradesh

ఓ కోతి ఆర్టీసీ బస్సు నడిపి డ్రైవర్ కు చుక్కలు చూపించింది. ముచ్చెమటలు పట్టించింది. ప్రయాణికులు కూడా హడలెత్తిపోయారు. కోతి ఏమిటి , బస్సు నడపడమేమిటి అనుకుంటున్నారా? కంగారు పెట్టించిన ఈ గమ్మత్తైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.....

ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఫిలిబిత్ నుంచి బరేలీకి వెళ్లింది. తిరిగి ఫిలిబిత్ బయలుదేరవలసి ఉంది. సమయం ఉండటంతో బస్సు డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేసి చివరి సీటులో కెళ్ళి కునుకుతీశాడు. కండెక్టర్ బస్సు కింద నిలబడి ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఓ కోతి బస్సులోకి దూరింది. ఎకాఎకినా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసింది. ఉలిక్కిపడిన డ్రైవర్ తన సీటు దగ్గరకు పరుగు తీశాడు.

ఇంజిన్ స్టార్ట్ చెయ్యడమే కాకుండా సెకండ్ గేర్ వేసి ముందుకు దూసుకు వెళ్లింది. అడ్డుకోవడానికి వెళ్లిన బస్సు డ్రైవర్ పై దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. కోతిని బయటకు పంపించడానికి డ్రైవర్ నానా తంటాలు పడ్డాడు. అయితే కోతి సెకండ్ గేర్ వేసి కిందకు దూకేసింది. డ్రైవర్ తన సీటులో కూర్చుని బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే బస్సు ముందు నిలిపి ఉన్న రెండు బస్సులను డీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు. కోతి బస్ స్టాండ్ లో చేసిన హంగామాకు ఆ డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు హడలిపోయారు.

English summary

A monkey came into the bus while driver taking rest at the last seat that monkey starts the bus and drives bus in uttar pradesh