పార్లమెంటు లైబ్రెరీలో కోతి హంగామా

Monkey Enters Into Parliament

11:14 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Monkey Enters Into Parliament

చాలా ఊళ్ళల్లో, నగరాల్లో నిత్యం కోతుల బెడదతో జనం సతమతమవుతున్నారు. ఇప్పుడు ఏకంగా భారత పార్లమెంట్ లోకే చొచ్చుకు వచ్చేసింది. పార్లమెంటు లోకి ఓ అనుకోని అతిథి వచ్చి అరగంట పాటు హల్ చల్ చేసింది. సెంట్రల్ హాలు పక్కనున్న పార్లమెంటు లైబ్రరీ లోకి ఎలా ప్రవేశించిందో గానీ.. గురువారం ఓ కోతి వచ్చి నానా హంగామా సృష్టించింది. ఎంపీలు, జర్నలిస్టు లు చదువుకునేందుకు ఉద్దేశించిన రీడింగ్ రూమ్ లో 30 నిముషాలసేపు కంగాళీ రేకెత్తించింది. టేబుళ్ళ మీదికి ఎక్కుతూ, కరెంటు వైర్ల పైకి ఎగబాకుతూ అందర్నీ ఉరుకులు, పరుగులు పెట్టించింది.

దాన్ని అదిలించేందుకు ప్రయత్నించిన సిబ్బంది కూడా విఫలయత్నం చేసి, చేతు లెత్తేశారు. వారి భయంతో ఎగ్జిట్ డోర్ వరకు వెళ్ళినా తిరిగి వచ్చిన అది.. చివరకు వీఐపీ ల ద్వారం నుంచి బయటపడింది. పార్లమెంటు పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. వాటిని అదుపు చేయడానికి పార్లమెంటు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. మొత్తానికి కోతి దూరిందని హనుమాన్ పూజలు చేస్తే భలే ఉండేదని పలువురు అనుకున్నారట.

ఇవి కూడా చదవండి:ఔటింగ్ కొచ్చిన మొసలి బెంబేలెత్తించింది.

ఇవి కూడా చదవండి:పులిని ఉరి తీశారు.. అందుకే సేవ్ టైగర్ అంటున్నాడు!

English summary

A Monkey Entered into Indian Parliament and spends 30 minutes there and Frightened all the people over there. At last it has gone from the parliament.