కోతులకు శిక్షణ కోసం ఓ స్కూల్..

Monkey Training School In China

10:37 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Monkey Training School In China

కోతులకు శిక్షణ అంటే ఆశ్చర్యపోతున్నారా.. వాటికి స్కూల్ ఏంటి అని బిత్తరపోతున్నారా.. కానీ ఇది నిజం చైనాలో నిజంగానే కోతుల కోసం ఒక స్కూల్ ఉంది. ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి పనులు చేయకండంటూ తిడతారు.. అలాగే కోతులు కూడా అల్లరి చేయడంలో దిట్టలే. అందుకే వీటిని దారిలో పెట్టందుకు ఈ పాఠశాల పెట్టారు. చైనాలో ప్రతి 12 ఏళ్లకోసారి మర్కట నామ సంవత్సరం వస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం కోతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌యింగ్ జూపార్క్‌లోని కోతుల స్కూల్‌లో వాటికి శిక్షణ ఇస్తున్నారు.

English summary

A monkey training school was started in a zoo in Dongying, eastern China. In this training school dozen monkeys are being trained at this Monkey School.