సుమ, అనసూయ నెల ఆదాయం ఎంతో తెలుసా?

Monthly income for anchor Anasuya and Suma

11:47 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Monthly income for anchor Anasuya and Suma

బుల్లి తెర యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సుమ తన మాట తీరు, నడవడికతో తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ కు చేరింది. బుల్లి తెర పై వచ్చే ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించిన సుమ ఆ తరువాత పెద్ద పెద్ద సినిమా ల ఆడియో వేడుకలకి కూడా ప్రచారకర్తగా వ్యవహరించడం మొదలు పెట్టింది. అంతే కాదు బెస్ట్ యాంకర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న సుమ చాలా తక్కువగా వివాదాలలో కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో అత్యంత ఎక్కువ డిమాండ్ ఉన్న యాంకర్ లలో సుమ ప్రధమ స్థానం లో ఉంది. సుమ అంత టాప్ యాంకర్ కాబట్టే ఆమె ప్రస్తుతం చేతి నిండా డబ్బులు బాగా సంపాదిస్తుంది.

సుమ నెలకు దాదాపు 15 – 20 లక్షల వరకు వెనకేస్తుందట! ఇక సుమ తరువాత స్ధానంలో హాట్ యాంకర్ అనసూయ కూడా ఉంది. బుల్లి తెర పై కూడా అందాలు ఆరబొయ్యొచ్చని అనసూయ నిరూపించింది. ప్రతీ కార్యక్రమంలో కురచ దుస్తులు వేసుకుని తన హాట్ లుక్స్ తో అభిమానుల్ని బాగానే సంపాదించుకుంది. అనసూయ కూడా పది లక్షలకు పైగా సంపాదిస్తున్నట్టు లెక్కల్లో తేలింది! మొత్తానికి వీరి సంపాదన చూసి షాకయిన వారు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి.. ఎంచక్కా యాంకర్లు అయిపోతే బెటరేమో అనే ఆలోచనలో ఉన్నారట!

English summary

Monthly income for anchor Anasuya and Suma. Hot anchor Anasuya monthly income was very shocking.