'మోస్ట్‌ అడ్‌మైర్డ్‌ సెలబ్రిటీ ఐకాన్'గా రామ్‌చరణ్‌!!

Most Admired Celebrity Icon of 2015 is Ram Charan Tej

03:19 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Most Admired Celebrity Icon of 2015 is Ram Charan Tej

పాపులర్‌ మ్యాగజైన్‌ 'రిట్జ్‌' 'మోస్ట్‌ అడ్‌మైర్డ్‌ సెలబ్రిటీ ఐకాన్‌ ఆఫ్‌ 2015' గా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ని ఎంపిక చేసింది. రామ్‌చరణ్‌ తో పాటు తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మినిష్టర్‌ కేటీఆర్‌ ను కూడా ఎంపిక చేసింది. కళాకారులు, వ్యాపారం, రాజకీయాలకి సంబంధించిన వారికి రిట్జ్‌ ఈ అవార్డులని సిఎన్‌ఎన్‌-బిఎన్‌ఎన్‌ వారితో కలిసి వారికి బహుకరించింది. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎన్డ్‌ లో డిసెంబర్‌ 13 న ఈ అవార్డులని వారికి అందజేసింది. ఈ అవార్డు అందుకున్న రామ్‌చరణ్‌ వేదిక మీద మాట్లాడుతూ ఈ అవార్డ్ నాకు రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, సెలెబ్రిటీ ఐకాన్ గా నన్ను ఎంచుకున్నందుకు 'రిట్జ్'కి నా దన్యవాధాలు.

తన తండ్రి చిరంజీవి 150వ చిత్రం గురించి అడగగా, నాన్నగారి 150వ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది తమిళ సూపర్‌హిట్‌ చిత్రం 'కత్తి'కి రీమేక్‌. తమిళంలో ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించబోతున్నారు. నేను కూడా తమిళంలో సూపర్‌ హిట్ అయిన 'తని ఒరువన్' రీమేక్‌లో నటించబోతున్నాను. ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'రక్షక్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాం అని రామ్‌చరణ్‌ ఈ సందర్భంగా చెప్పారు.

English summary

Ritz Magazine gave a award as Most Admired Celebrity Icon of 2015 to Ram Charan Tej.