అత్యంత విషపూరితమైన పాము

Most dangerous snake in California

06:17 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Most dangerous snake in California

పాములతో చాలా జాతులు ఉన్నాయి. అన్నింటికీ విషం ఉండకపోవచ్చు కాని కొన్ని అయితే చాలా విషపూరితమైనవి ఉన్నాయి. అందులో కొన్ని మనకు తెలిసినవి కట్లపాము,నాగుపాము మొదలగునవి మాత్రమే మనకు తెలుసు. కొన్ని పాములు విషాన్ని చిమ్మి చంపుతాయి, కొన్నిటికి తోకలో విషం ఉంటుంది, మరి కొన్నిటికి కోరల్లో ఉంటుంది. పాములలో పలు రకాల జాతులు ఉన్నాయి అందులో కొన్ని ప్రమాదకరమైనవి మరికొన్ని కావు. కొన్ని పాముల విషం శరీరం మీద పడగానే వెంటనే అక్కడికి అక్కడే మరణిస్తారు. అలాంటి కోవకు చెందిన పామును పరిశోదకులు గుర్తించారు.

గడిచిన 30 ఏళ్ళలో తొలిసారిగా కాలిఫోర్నియా లో ఒక అత్యంత విషపూరితమైన పాము జాతిని గుర్తించారు.ఇది సముద్రపు పాము. ఈ పాము గోల్డెన్‌ స్టేట్‌కి సంబందించినంత వరకు 1980 లో ఈ పసుపు రంగు ఉదరం కలిగిన విషపూరిత పాము చివరిసారిగా కనిపించింది. పసుపు రంగు ఉదరం కలిగిన సముద్రపాము ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాణాంతకమైన విషం ఉత్పత్తి చేస్తుంది. ఇది కాలిఫోర్నియా లో అనుకోకుండా సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వచ్చిందని అక్కడి వీక్షకులు తెలియజేసారు. నిజానికి ఇవి వెచ్చని నీటిలో జీవించడానికి ఇష్టపడతాయి.

English summary

Most dangerous snake in California.For the first time in 30 years a venomous snake species has been spotted in California .