ప్రపంచ సినీ శ్రీమంతులు... వీరి ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Most expensive film actors in world

05:41 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Most expensive film actors in world

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు.. ఇంతటి ప్రాధాన్యత గల ధనం ఎలా వస్తుందో, ఎలా పోతుందో తెలీదు. అయితే కొందరు పగడ్బందీగా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లు పోగేసుకుంటారు. అయితే ధన సంపాదన విషయంలో ఒక్కో ఏడాది ఒక్కోలా మన కథానాయకుల పరిస్థితి ఉంటుంది. ఇక ప్రపంచంలో అత్యధిక సంపాదన విషయంలో టాప్ ట్వంటీలో సల్మాన్ ఖాన్ కు 14వ స్థానం దక్కింది. జూన్ 1, 2015 - జూన్ 1, 2016 మధ్య సినిమాలు, ప్రకటనల ద్వారా కథానాయకుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు.

ఏది ఏమైనా ఫోర్బ్స్ 2016కు ప్రకటించిన ప్రపంచంలో అత్యధిక సంపాదనపరులైన టాప్-20 కథానాయకుల జాబితాలో మన వాళ్లు నలుగురు ఉండటం నిజంగా సంతోషమే. ఇక ఆ సినీ శ్రీమంతుల విశేషాలు చూద్దాం..

1/14 Pages

8వ స్థానంలో షారుఖ్...


ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే కథానాయకుల ఫోర్బ్స్ జాబితాలో గత ఏడాది షారుఖ్ ఖాన్ ది 18వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది ఎనిమిదో స్థానంతో టాప్ టెన్ లోకి దూసుకొచ్చేశాడు. షారుఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. దిల్ వాలేకు పారితోషికంగా భారీ మొత్తాన్నే అందుకొన్నాడట. గత ఏడాది 18వ స్థానంలో ఉన్న షారుఖ్ ఈ సారీ టాప్ టెన్ లోకి వచ్చి జోరు చూపించాడు. 221.19 కోట్ల రూపాయలతో షారూఖ్ 8వ స్థానంలో వున్నాడు. సినిమాల పారితోషికాలతో పాటు డజనుకు పైగా ఉత్పత్తులకు షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వున్నాడు. ఇవే షారుఖ్ ఆదాయన్ని పెంచాయి.

English summary

Most expensive film actors in world