మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్స్ ఇవే.. విమానాలు కూడా ఈ ట్రైన్స్ ముందు వేస్టే!

Most expensive trains in India

04:32 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Most expensive trains in India

ప్రయాణాల్లో రైలు ప్రయాణంలో ఉండే కిక్కే వేరు. ఎందుకంటే, పచ్చని ప్రకృతి సహజ సిద్ధమైన అందాల నడుమ ట్రైన్ లో వెళ్తుంటే... ఆహా... ఆ ఆహ్లాదం వేరు. ఆ అనుభవం తలచుకుంటే వెంటనే అలాంటి జర్నీ చేయాలని అనుభూతి కలుగుతుంది. నిజం చెప్పాలంటే, విమానాల్లో వెళ్లే వారికి కూడా అంతటి ఆహ్లాదానుభూతి కలగదేమో. అందుకే రైలు ప్రయాణం అంటే చాలా మంది మక్కువ చూపిస్తారు. అయితే అది జనరల్ బోగీల్లో కాదులేండి. రైలులో ఎంచక్కా రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణం చేస్తుంటే, ముఖ్యంగా హాయిగా పడుకుని వెళితేనే రైలు ప్రయాణంలో మజా తెలుస్తుంది.

ఈ క్రమంలో ఏసీ రిజర్వేషన్ చేయించుకుని రాజభోగాలతో ట్రైన్ లో ప్రయాణిస్తే..? అబ్బో, ఇక వర్ణించలేం. అయితే అలాంటి భోగాలు అనుభవిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ప్రయాణం చేసేలా మన భారతీయ రైల్వే కొన్ని టూరిస్ట్ రైళ్లను నడుపుతోంది. కాకపోతే వాటిలో ప్రయాణించాలంటే జేబునిండా డబ్బులు ఉండాల్సిందే. మరి అలాంటి మహారాజ సౌకర్యాలను అందిస్తూ, ప్రయాణంలోని మజాను అందించే విలాసవంతమైన రైళ్ల గురించి ఓ సారి చూద్దాం..

1/6 Pages

ప్యాలెస్ ఆన్ వీల్స్: (Palace On Wheels)


ప్యాలెస్ ఆన్ వీల్స్ అని పిలవబడే ఈ రైలు ఢిల్లీ రాజస్థాన్ ల మధ్య నడుస్తోంది. దీని ధర రూ.2 లక్షల నుంచి రూ.2.75 లక్షల మధ్య ఉంటుంది.

English summary

Most expensive trains in India. Most expensive and luxury trains in India. These trains are must luxurious and expensive in India.