ఒబామా@1.. మోదీ@7

Most Popular Leader Barack Obama at 1st place and Modi at 7th Place

05:27 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Most Popular Leader Barack Obama at 1st place and Modi at 7th Place

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. వోఆర్‌బీ ఇంటర్నేషనల్స్‌ అనే సంస్థ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ లీడర్స్‌పై సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివదిక ప్రకారం ఒబామా మొదటిస్థానంలో నిలిచారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏడో స్థానం దక్కడం గమనార్హం. మొత్తం 65 దేశాల్లో ఈ సర్వే చేపట్టగా.. ప్రధాని మోదీకి అనుకూలంగా 24 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. మరో 20 శాతం మంది మోదీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా 30 శాతం ఓట్లు సాధించారు. ఒబామాకు అనుకూలంగా 59 శాతం మంది.. వ్యతిరేకంగా 29 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయనకు అనుకూలంగా 30 శాతం మంది ఓట్లు వేశారు. ఒబామా తర్వాతి స్థానాల్లో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజిలా మెర్కెల్‌, బ్రిటీష్‌ ప్రధాని డేవిడ్‌ కేమెరూన్‌ నిలిచారు.

English summary

In a recent survey for worlds most popular leaders, Barack Obama occupies 1st place and Modi stands at 7th Place.