నాగార్జున తరువాత ఎక్కువ విజిల్స్ అనుష్కకే!!

Most vigils for Anushka after Nagarjuna

10:30 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Most vigils for Anushka after Nagarjuna

అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. థియేటర్ లో తండ్రి పాత్రలో నటించిన నాగార్జున ఎంట్రెన్స్ సీన్ వచ్చినప్పుడు ఎక్కువ విజిల్స్ వేస్తారు ప్రేక్షకులు.

ఈ చిత్రంలో అనుష్క ఒక సీన్ లో తళుక్కున మెరుస్తుంది. నెమలి కంఠం రంగు చీరలో అనుష్క ఎంతో అందంగా కనిపిస్తుంది. నాగార్జున ఎంట్రెన్స్ కి పడినన్ని విజిల్స్ అనుష్క కి కూడా పడ్డాయంట. అంటే అనుష్క కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దీని బట్టి తెలుస్తుంది. అనుష్క ని నాగార్జున నే తెలుగు తెరకు పరిచయం చేశారు. అనుష్క ఇప్పుడు అగ్రతారగా మెరుస్తుందంటే దానికి నాగే కారణం. అందుకే నాగ్ తన చాలా సినిమాల్లో అనుష్క ని అతిధి పాత్రలో అయినా కనిపించేలా చేశారు. అనుష్క కూడా నాగ్ సార్ ఎప్పుడు అడిగినా నేను ఆయనతో నటించడానికి సిద్ధమని చెప్తుంది అనుష్క.

English summary

Audience most vigils for Anushka after Nagarjuna in theatre while watching Soggade Chinni Nayana movie. This movie is directed by Kalyan Krishna Kurasala.