కిడ్నీలు పాడైన కొడుకులతో కలిసి తల్లి ఆత్మహత్య

Mother and 3 sons gets suicide for kidney disease

12:23 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Mother and 3 sons gets suicide for kidney disease

ఆత్మహత్యలకు సవాలక్ష కారణాలు ఉంటున్నాయి. కానీ కిడ్నీల జబ్బుతో బాధపడుతున్న ముగ్గురు కొడుకులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలోని రాగాల రామిరెడ్డి, భూలక్ష్మి(45) వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరికి ప్రభుప్రకాశ్(22), అనీల్(20), ప్రేమసాగర్(17) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో ప్రభుదాస్ పాలిటెక్నిక్, అనీల్ బీఏ, ప్రేమసాగర్ పదో తరగతి చదివారు. ప్రేమసాగర్ కు కిడ్నీ పాడవడంతో కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో మూడేళ్లుగా వైద్యం చేయిస్తున్నారు.

కొద్దిరోజులుగా అనీల్, ప్రభుప్రకాశ్ సైతం నీరసంగా కనిపిస్తున్నారు. బుధవారం వారిని తండ్రి కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షల్లో వారిద్దరికీ కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తేలింది. ఏమీ పాలుపోని తండ్రి ముగ్గురు కొడుకులను తీసుకుని ఇంటికొచ్చాడు. జరిగిన విషయాన్ని భార్యకి చెప్పి దిగులుగా పడుకొన్నాడు. రామిరెడ్డిని నిద్రపోయాక భార్య భూలక్ష్మి ముగ్గురు కుమారులను తీసుకొని బయటకు నడిచింది. సరాసరి సరుగుడు తోటలను ఆనుకొని ఉన్న ఉప్పుటేరు వద్దకు చేరుకుంది. వెంట తెచ్చుకొన్న పురుగుల మందుని ఒకరి తరువాత ఒకరు తాగేశారు.

సిల్కు తాడును నడుము భాగంలో కట్టుకుని అంతా ఉప్పుటేరులోకి దూకేశారు. ఉదయం లేచాక ఇంట్లో భార్య బిడ్డలు లేకపోవడాన్ని గమనించిన రామిరెడ్డి, గ్రామస్తులతో కలిసి అంతటా గాలించగా.. ఉప్పుటేరులో విగతజీవుల్లా పడి ఉన్న నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో విషాదం అలుముకుంది.

English summary

Mother and 3 sons gets suicide for kidney disease