తల్లి పాలలో పాము విషం - తల్లీ బిడ్డ మృతి

Mother and Child dies after Snake Bite in Ananthapuram District

12:57 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Mother and Child dies after Snake Bite in Ananthapuram District

అబ్బబ్బ ఎంత దారుణం జరిగిపోయింది. పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు విడిచాడు. హృదయ విదారకమైన ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన లింగన్న భార్య చంద్రకళ (30)ను గురువారం తెల్లవారుజామున పాము కాటువేసింది. అయితే దీన్ని ఆమె గమనించలేదు. కాలి పట్టీ గుచ్చుకుని ఉంటుందని భావించి ఇంటి పనులు చేసుకోవడం ప్రారంభించింది. కొద్దిసేపటికి గుండెల్లో నొప్పిగా అనిపించడంతో భర్తకు ఆ విషయం చెప్పింది. అతడు ఆమెను గుత్తి ప్రభుత్వాసుపత్రి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. తిరిగి వచ్చేందుకు సమయం పడుతుందని భావించిన చంద్రకళ తన చిన్నారి వంశీకి పాలు తాగించింది. ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఆమెను పాము కాటువేసిందని చెప్పారు. చికిత్స చేస్తుండగానే అమె పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాలు కూల్పోయింది. పాలు తాగిన బిడ్డ కూడా మృత్యువాత పడ్డాడు.

ఇవి కూడా చదవండి:నరకం అంటే ఇలా ఉంటుందా...(వీడియో)

ఇవి కూడా చదవండి:24 ఏళ్ళ టీచర్ ను గర్భవతి చేసిన 13 ఏళ్ళ స్టూడెంట్!

English summary

A Woman Named Chandrakala was bite by snake and later she didnot recognise that and she gave milk to her small son and Chandrakala and Son Vamshi two were died because of poison.