అసభ్యకరమైన ఫోటో పోస్ట్ చేసిన కూతుర్ని తల్లి ఏం చేసిందో చూడండి(వీడియో)

Mother beats daughter for abusing photo

11:29 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Mother beats daughter for abusing photo

సోషల్ మీడియా రంగంలోని ఫేస్ బుక్ లో అభ్యంతకర ఫోటో పెట్టిన 16 ఏళ్ల కూతురిపై తల్లి చితకబాదిన ఘటన అమెరికాలోని జార్జియాలో చోటు చేసుకుంది. అక్కడితో ఆగకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీయించి, మరీ తన కుమార్తె ఫేస్ బుక్ పేజీలోనే ప్రత్యక్ష ప్రసారం చేసింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసివున్న అభ్యంతకర ఫోటోను తన కూతురు ఫేస్ బుక్ లో పెట్టిందని తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. షనవియా మిల్లర్ అనే ఆ తల్లి కట్టె తీసుకుని తన కూతుర్ని చితక్కొట్టింది. కూతురి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని అక్కడే ఉన్న మరొకరి దాన్ని ఇచ్చి వీడియో తీయమంది. తర్వాత కుమార్తెపై విరుచుకుపడింది.

నా పరువు తీస్తావా అంటూ చెడామడా చెంపదెబ్బలు వాయించింది. ఇదంతా కూతురి ఫేస్ బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసి, షేర్ చేయాలని ఫాలోవర్లను కోరింది. కూతురిపై చేయి చేసుకోవడాన్ని ఆమె సమర్థించుకుంది. తన కుమార్తె అంటే ఎంతో ఇష్టమని, ఆమె అభాసుపాలు కాకూడదన్న ఉద్ధేశంతో గట్టిగా మందలించానని చెప్పుకొచ్చింది. ఈ వీడియో కొంతమంది సేవ్ చేసి, యూట్యూబ్ లో పెట్టారు. తన తల్లి బాధను అర్థం చేసుకున్నానని, ఆమెపై కోపం లేదని మిల్లర్ కుమార్తె పేర్కొంది. అమ్మతోనే కలిసివుంటానని పోలీసులతో చెప్పింది. మిల్లర్ చర్యను నెటిజన్లు తప్పుబట్టారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆమెపై కేసు నమోదు చేశారా, లేదా అనేది వెల్లడి కాలేదు. అదీ సంగతి.

English summary

Mother beats daughter for abusing photo