కూతురిని చూడాలని వచ్చి అల్లుడితో అక్రమసంబంధం పెట్టుకుని ఆ పై పెళ్లి కూడా..

Mother in law married son in law in Bihar

01:16 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Mother in law married son in law in Bihar

రోజురోజుకి అక్రమసంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమసంబంధాలకి వావివరుసలు కూడా చూడటంలేదు. రోజుకో అక్రమసంబంధం బయట పడుతుంది. తాజాగా మరో అక్రమసంబంధం బయట పడింది. ఆ వివరాల్లోకి వెళితే.. లలిత(19) సూరజ్ కు(22) రెండేళ్ళ క్రితం పెళ్లైంది. అయితే లలిత తల్లి ఆశాదేవి తరచూ కూతుర్ని చూడటానికి అల్లుడు ఇంటికి వెళ్ళేది. ఈ నేపధ్యంలో అత్తకి(ఆశాదేవి) అల్లుడుకి(సూరజ్) మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ వ్యవహారం కాస్తా శ్రుతిమించి అక్రమసంబంధం వరకు దారి తీసింది. ఇక ఇదే అదునుగా చూసుకుని తరచూ అల్లుడి ఇంటికి వచ్చి అల్లుడితో రాసలీలలు సాగించేది.

అత్త మోజులో పడిన సూరజ్ భార్యని పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఈ విషయం పై రోజూ సూరజ్-లలితల మధ్య గొడవలు జరిగేవి. తల్లిలా చూడాల్సిన అత్తతో అక్రమసంబంధం పెట్టుకోవడం తప్పని భార్య ఎంత చెప్పినా సూరజ్ వినలేదు. అయితే చివరకు సూరజ్-ఆశాదేవిలు పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు! వీరి పెళ్ళికి పంచాయతీ పెద్దలు కూడా అంగీకరించడంతో ఏ వివాదం లేకుండా పోయింది. లలితకు ఒక బాబు కూడా ఉన్నాడు. కన్నకూతురి జీవితాన్నే తల్లి పాడుచేసిందని గ్రామస్థులంతా ఆశాదేవిని ఆడిపోసుకుంటున్నారు. ఇంక చేసేది లేక లలితను ఆమె తండ్రి పురానిలోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ ఘటన బీహార్ లోని మధేపుర జిల్లాలో జరిగింది.

English summary

Mother in law married son in law in Bihar