కుక్క పిల్లకు ఈ కోతి తల్లేలా అయింది

Mother monkey to puppy

03:24 PM ON 4th February, 2017 By Mirchi Vilas

Mother monkey to puppy

సమాజంలో రాకరాక వ్యక్తులున్నట్లే జంతువుల్లో కూడా రకరకాల మనస్థత్వాల జంతువులుంటాయి. కానీ మనిషి కన్నా జంతువులే నయం అనే విధంగా కొన్ని ఘటనలు ఉంటాయి . మనకు దారిలో మనకు ఎవరైనా అనాథ పిల్లలు కనిపిస్తే, ఆదరించి అక్కున చేర్చుకునే వారు చాలా స్వల్పంగా, అతి తక్కువగా ఉంటారు. ఎదో పదో పరకో ఇచ్చే వాళ్ళు కొడతాయితే, కసురుకునేవాళ్ళు ఇంకొందరు. అది మనుషుల విషయానికి వస్తే..! కానీ జంతువులు మాత్రం అలా కాదు, వాటికీ అలా అక్కున చేర్చుకునే స్వభావం ఉంటుంది. ఇతర అనాథ జీవాలను ఆదరించే గుణం ఉంటుంది. అవును, అందుకు అలహాబాద్లో తాజాగా జరిగిన ఓ సంఘటనే తార్కాణం. ఓ కుక్కపిల్లకు ఓకోతి తల్లయింది.

అలహాబాద్లో ఇటీవలే ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. కొంచెం వివరాల్లోకి వెళ్తే, ఓ కుక్క పిల్ల వీధుల్లో తిరుగుతుండగా దాన్ని చూసిన ఓ కోతి అక్కున చేర్చుకుంది. సొంత తల్లి దగ్గరికి చేరదీసినట్టుగా ఆ కుక్క పిల్లను ఒడిలో చేర్చుకుంది. తనతోపాటు తీసుకెళ్లింది. కోతి అన్నాక అటు, ఇటు దుంకడం సహజం. అయితే ఆ కోతి కూడా అటు ఇటు ఎక్కడం దూకం చేసింది. అయినా తన చేతిలో ఉన్న కుక్కపిల్లను వదల్లేదు. తల్లి మాదిరిగా గట్టిగా హత్తుకుని పట్టుకుంది.

ఇది కూడా చూడండి: రోడ్డెక్కిన అడవి రాజులు - ఎందుకో తెలుసా

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

English summary

monkey became mother to puppy this incident took place on Allahabad.