హీరో డాటర్ కి మత్తుమందిచ్చి.. నరకం చూపిన తల్లి

Mother physically tortured her daughter with drugs

11:17 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Mother physically tortured her daughter with drugs

లోకం తీరు ఇంత దారుణంగా తయారైందా? లేకపోతే కన్న కూతురిపట్ల ఓ మహాతల్లి క్రూరంగా వ్యవహరిస్తుందా? నిజంగా ఆ తల్లి అమ్మతనానికి మచ్చతెచ్చింది. డ్రగ్స్ కు బానిసను చేసి, జైల్లో ఖైదీ కంటే ఘోరంగా హింసించింది. ‘అమ్మా నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలెయ్’ అంటూ ఆ కూతురు ఎంత మొరపెట్టుకున్నా, పైశాచికానందం అనుభవించిందే తప్ప ఆమె ఆవేదనను ఆ కఠినాత్మురాలు వినిపించుకోలేదు. చివరికి ఎలాగోలా తల్లి బారి నుంచి తండ్రి చెంతకు చేరిన ఆ బాలిక.. తనపై తల్లి జరిపిన దారుణాలను వెల్లడించింది. దీంతో.. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబయిలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ హీరో ఎవరో , ఆ కుటుంబం ఏమిటో తెల్సితే, సమాజంలో ఆ హీరోకి వున్న పేరు పోతుందన్న ఉద్దేశ్యంలో సోషల్ మీడియాలో పేర్లు మార్చి, ఈ కధనం అందించారు. ఈ కధనం విస్తృతంగా హల్ చల్ చేస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ మిశ్రా(పేరు మార్చాం) గతంలో హిందీ సినిమాల్లో నటిస్తూ, అప్పట్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపాడు. అయితే ఈ నటుడికి కాలక్రమంలో అవకాశాలు తగ్గుతూ, చివరికి అతను తెరపై కనుమరుగయ్యాడు. అయితే అప్పటికే ఇద్దరితో పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకున్న అతడికి షాలినితో వివాహం అయ్యింది. అయితే.. వీరి మధ్య బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరిద్దరూ వీడిపోయి ఏడు సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే.. ఈ దంపతులకు 15 సంవత్సరాల మిషా (పేరు మార్చాం) అనే బాలిక ఉంది. షాలిని భర్తతో విడిపోయిన తర్వాత కూతురు మిషాను తన దగ్గరే ఉంచుకుంది. ఆమెను కంటికి రెప్పగా చూసుకోవాల్సిన షాలిని.. ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని అడ్డదారులు తొక్కింది. అమిత్ కుమార్ అనే వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న షాలిని.. తన కూతురు మిషా పట్ల కర్కశంగా ప్రవర్తించింది. స్కూల్ కు పంపించకుండా ఇంటికి పరిమితం చేసింది. ఇలా ఒకటా రెండా ఏకంగా ఏడు సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చింది. తన ప్రియుడి సాయంతో కూతురికి బలవంతంగా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి దారుణంగా వ్యవహరించింది. తన తల్లి నుంచి తప్పించుకోవడం కోసం మిషా ఎన్నోసార్లు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది.

మొత్తానికి తన స్నేహితుల సహాయంతో గత నెల 29న మిషా తల్లి చెర నుంచి తప్పించుకున్న ఆమె తండ్రి వద్దకు చేరుకుని జరిగిందంతా చెప్పేసింది. దీంతో.. ఆమెపై అభిషేక్ ఫర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కూతురిపట్ల ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరించావని షాలినిని అడగగా.. అందుకు బలమైన కారణమే ఉందని చెప్పింది. షాలినికి, రెండో భర్తకు పుట్టిన అబ్బాయిని ఆమె ప్రేమగా చూసుకునేదట. మిషాను చిన్నచూపు చూడటానికి అదే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంత దుశ్చర్యకు పాల్పడినా తనని ఎవరేమీ చేయలేరని షాలిని ధీమాగా ఉంది. ఎందుకో తెలుసా..? ప్రస్తుతం ఆమె బీజేపీ నేత కావడమేనని అంటున్నారు. అన్నట్టు గతంలో షాలిని సినిమాల్లో దర్శకత్వ బాధ్యతలు నెత్తిన వేసుకుని చేతులు కాల్చుకున్న చరిత్ర కూడా ఉందట. ఇది ఏమైనా ఇష్టం లేకపోతే తండ్రి దగ్గరకు పంపేయాలే తప్ప కన్న కూతురి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం ఎందుకని పలువురు నెటిజన్లు మండిపడుతూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.

ఇది కూడా చూడండి: తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతుంటే, ఇలా చేయాలంట

ఇది కూడా చూడండి: మనషి చనిపోయినా కొన్ని అవయవాలు సజీవంగా ఉంటాయట...

ఇది కూడా చూడండి: మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

English summary

Mother physically tortured her daughter with drugs.