నాలుగు అంతస్తుల పై నుంచి పిల్లల్ని తోసేసిన తల్లి

Mother pushed her children from top of the building

10:30 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Mother pushed her children from top of the building

అవును కన్న తల్లే తన పిల్లల్ని నాలుగు అంతస్తుల పై నుండి కిందకి తోసేసింది.. ఏంటీ ఆమె ఓ కసాయి తల్లో లేక మతి స్థిమితం లేకపోవడం వల్లో అలా చేసింది అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలు వేసినట్లే.. ఆమె తోసేసింది వాళ్ళని కాపాడటానికి.. ఏంటి కిందకి తోసేస్తే వాళ్ళెలా బ్రతికుంటారు అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. ఒక త‌ల్లి త‌న ముగ్గురు చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి ఓ భ‌వ‌నంలో నాలుగో అంత‌స్తులో ఉంటోంది. ఇంత‌లో ఆక‌స్మాత్తుగా అక్క‌డ మంట‌లు చెల‌రేగాయి. ఎవ‌రైనా అయితే ఒక్క‌సారిగా ఏం చేయాలో తెలియ‌క నానా కంగారు ప‌డిపోతారు. కానీ ఆ మ‌హిళ చాలా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించింది.

ఆమె ఏం చేసిందో మీరే చూడండి. దక్షిణ కొరియాలో నాలుగు అంత‌స్తుల‌ బిల్డింగ్‌లో నివాస‌రం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఆమెతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ తల్లి 4 అంతస్థుల పై నుంచి ముగ్గురు పిల్లలను కిందకు పడేసింది. ఆ తర్వాత ఆమె కూడా కిందకు దూకింది. బిల్డింగ్ కింద ప్రజలు ఉండటంతో ఆ పిల్లలను పడేసిన సమయంలో వారు కాపాడారు. అయితే అదృష్టవశాత్తు తల్లీపిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ పరిణామాన్ని అంతటినీ ఎవరో అత్యుత్సాహంతో వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. మీరు కూడా ఒక లుక్ వెయ్యండి...

English summary

Mother pushed her children from top of the building. In Soth Korea a mother pushes her children from top of the building.