అందాల పోటీలో పోటీపడుతున్న వీళ్ళు కవలలు కాదు

Mother Sarah Louise And Daughter Ella Ravenscroft Beauty Queens

11:22 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Mother Sarah Louise And Daughter Ella Ravenscroft Beauty Queens

అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఎన్నో నిబంధనలు, మైలురాళ్ళు అధిగమించాలి. ఒకవేళ అన్నింటినీ దాటుకొని పోటీల్లో పాల్గొన్నా గెలవడం చాలా కష్టం. పాల్గొనే వారంతా అందగత్తెలే.. కానీ గెలిచేదేవరో చివరి నిమిషం వరకు తెలియదు. పట్టణం మొదలుకుని ప్రపంచస్థాయి వరకు ఈ అందాల పోటీలు జరుగుతుంటాయి. ఒక్కసారి అందగత్తె కిరీటం దక్కితే, వూహించని పాపులారిటీ వచ్చేస్తుంది. అయితే అలాంటి అద్భుతమైన అవకాశం ఒకే కుటుంబంలో దక్కింది. వీరిద్దరూ ఒకేలా వుంటారు. కానీ కవలలు కానేకాదు. వీళ్ళు తల్లీ కూతుళ్లు. ఇప్పుడు ఆ ఇద్దరూ ప్రపంచ విజేతలు అవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇంగ్లాండ్ కి చెందిన బ్యూటీషియన్ అయిన 41ఏళ్ల సారా లూయిస్ ప్రిచర్డ్ ఆరుగురు పిల్లల తల్లి. కొద్దిగా బొద్దుగా ఉంటుంది. అయితే ఇప్పటి యువత సన్నబడటంపైనే మక్కువ చూపుతుండటం సారాకు విచారం కలిగించిందట. అందగత్తెలు సన్నగానే ఉండాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకుంది. అంతే ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ‘మిసెస్ గెలాక్సీ యూకే’ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత నిర్వహించిన ‘మిస్ టీన్ గెలాక్సీ యూకే’ పోటీల్లో ఆమె కుమార్తె 18ఏళ్ల ఎల్లా రావెన్స్ క్రాఫ్ట్ విజేతగా నిలిచింది. దీంతో రెండు బ్యూటీ కాంటెస్ట్ కిరీటాలను సొంతం చేసుకున్న తల్లీకూతుళ్లుగా రికార్డు సృష్టించారు.

ఈ ఇద్దరికీ 2017లో అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్న ‘గెలాక్సీ ఇంటర్నేషనల్ పీజీయంట్ ’ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఇది కూడా చూడండి: భారత దేశంలోని కోటీశ్వరుల అందమైన కూతుళ్ళు

ఇది కూడా చూడండి: తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

ఇది కూడా చూడండి: ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

English summary

Mother Sarah Louise And Daughter Ella Ravenscroft Beauty Queens. They were crowned Mrs Galaxy UK and Miss Teen Galaxy England.