అసలు ఈమె అమ్మేనా - చిన్న పిల్లాడిని ఏం చేసిందో తెలుసా?

Mother throws her 2 Year old son from steps

05:07 PM ON 28th January, 2017 By Mirchi Vilas

Mother throws her 2 Year old son from steps

నవమాసాలు మోసి కన్న బిడ్డను కళ్ళల్లో పెట్టుకుని చూడాల్సిన ఆ తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించింది. కన్న ప్రేమను మరిచి బిడ్డను మెట్లపై నుంచి కింద పడేసింది. ఈ ఘోర ఘటన డిల్లీలోని పుల్ ప్రహ్లద్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కుటుంబ కలహాల కోపాన్ని కన్నబిడ్డపై చూపిస్తూ మెట్లపై నుంచి తోసేసింది. దీంతో చిన్నారి ముఖానికి, తలకు గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. తన భార్య కన్నబిడ్డను చంపడానికి ప్రయత్నించిందని ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో ఈ సంఘటన మొత్తం రికార్డైంది.

సీసీ టీవీ పుటేజీలో చూస్తే.. నిందితురాలు బెడ్ పై కూర్చొని తన అత్తామామలతో గొడవ పడుతోంది. ఈ సమయంలో బెడ్ పై నిద్రపోతున్న కన్నబిడ్డను మెట్ల వద్దకు తీసుకెళ్లి కిందికి విసిరేసింది. దీంతో ఆమె అత్తమామలు చిన్నారిని కాపాడడానికి కింది పరుగులు తీశారు. ఈ ఘటన జనవరి 11న జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. కానీ 12 రోజుల తర్వాత అంటే.. జనవరి 24 పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు నమోదు చేసుకున్నామని, . నిందితురాలిని విచారించినా నోరు విప్పలేదని పోలీసులు అంటున్నారు.

English summary

Delhi women throws her 2 year old son from staircase that was recorded on CC TV footage. Her husband complained against his wife upon this incident.