ఫ్లిప్ కార్ట్ లో మోటో జి టర్బో ఎడిషన్

Moto G Turbo Available In Flipkart

04:01 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Moto G Turbo Available In Flipkart

ప్రముఖ మొబైల్ తయారీదారు మోటోరోలా 'మోటో జి టర్బో ఎడిషన్' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. గురువారం నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్ లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ రూ.14,499 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది. ఫ్లిప్ కార్ట్ మరిన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. తొలి వంద మంది కస్టమర్లకు వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 6 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎయిర్టెల్ నుంచి డబుల్ డాటా ఆఫర్ ను కూడా అందిస్తోంది. మోటో జీ జెన్ 3, మోటో ఎక్స్ ప్లే మధ్య గ్యాప్ ను పూరించేందుకు ఈ కొత్త మొబైల్ ను కంపెనీ తీసుకొచ్చింది.

ఐపీ67 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రీపెల్లెన్స్ ఈ ఫోన్ ప్రత్యేకత. 5 ఇంచ్ హెచ్‌డీ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొమరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. 2470 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మోటోరోలా టర్బు క్విక్ చార్జింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్స్ లో లభ్యమవుతోంది.

English summary

Motorola launched its new smart phone moto g turbo. This phone was avaible on online site flipkart