ఇండియాలోకి మోటో జీ టర్బో

Moto G turbo launched in India

03:15 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Moto G turbo launched in India

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మోటోరోలా సంస్థ తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ టర్బోను ఈ వారం భారత్ లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మోటారోలా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. తొలుత ఈ ఫోన్ ను మెక్సికో మార్కెట్‌లో గత నెలలో మోటోరోలా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సిమ్ (మైక్రోసిమ్), ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 2 జీబీ డీడీఆర్3 ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ ఉండటం దీని స్పెషాలిటీ. ఐపీ67 సర్టిఫైడ్ వాటర్ రెసిస్టెంట్ పవర్ తో పనిచేయనుంది. దీని వల్ల 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇక 2470 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ధర రూ.18,600.

English summary

Motorola Launched a new smart phone in its moto g series called Moto G Turbo. This phone is to be launched in India in this week