మోటో జీ టర్బో న్యూ ఫీచర్స్ తో..

Moto G Turbo New Edition

06:46 PM ON 9th November, 2015 By Mirchi Vilas

 Moto G Turbo New Edition

ప్రస్తుతం జీవన శైలి అంతా ఫ్యాషన్ వైపు మొగ్గుచూపుతుంది. ఎప్పుడు కొత్త ఫీచర్స్ వస్తాయా.. కొత్త ఫోన్లు మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూసె వినియోగదారులకు శుబవార్త. .మోటో జీ టర్బో కొత్త హంగులతో మార్కెట్ లో విడుదల అయింది. 5 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 సిస్టమ్ చిప్ తో మోటో జీ టర్బో నవంబర్ 13 నుండి మార్కెట్ లో లబ్యమవుతుంది.దీని ధర సుమారు గా రూ .18,600 . ఇది డ్యూ యల్ సిమ్, ఆండ్రాయ్ డ్ 5.1.1 లాలిపాప్ తో పనిచేస్తుంది. 5 అంగుళాల పూర్తిగా హెచ్డి (1080x1920) పిక్సల్స్ రెసల్యూషన్ కలిగి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పూత తో తయారు చేయబడింది. ఇది 64 బిట్ అక్ట-కోర్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రోసెసర్, అడ్రేనొ 405 జీపీయు ,2 జిబి మెమోరీ తో సిద్దమైంది. మోటో జీ టర్బో ఎడిషన్ 16జిబి ఇన్బిల్ట్ మెమోరీ స్టోరేజ్ కలిగి ఉంది . ఇంకా అదనపు డేటా మ్యాక్రో ఎస్ డి కార్డ్ లో సేవ్ అవుతుంది. 13-మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5-మెగా పిక్సల్ ఫ్రెంట్ కెమెరా వంటి సౌకర్యాలు కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

English summary

Moto G Turbo New Edition launched with new features 5 inch display and snapdragon 615 SoC and dual sim with 16 GB in built storage