భారత్‌లో రిలీజ్ అయిన మోటో ఎక్స్‌ ఫోర్స్‌

Moto X Force Released In India

10:03 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Moto X Force Released In India

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవోకు చెందిన అనుబంధ సంస్ధ మోటో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. మోటో ఎక్స్‌ ఫోర్స్‌ పేరుతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 32 జీబీ వేరియంట్‌ ధర రూ.49,999. 64జీబీ వేరియంట్‌ ధర రూ.53,999. ఫోన్‌ను ఫిబ్రవరి 8 నుంచి ఈ-కామర్స్‌ సైట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిటైల్‌ స్టోర్లలో కొనుక్కోవచ్చు. మోటో ఎక్స్‌ ఫోర్స్‌ను బ్లాక్‌, గ్రే, వైట్‌ కలర్లలో విడుదల చేశారు. అయితే షట్టర్‌షీల్డ్‌ డిస్‌ప్లేతో(స్క్రీన్‌ పగలకుండా ఉండే) టెక్నాలజీని ఈ ఫోన్ లో వినియోగించడం గమనార్హం.

మోటో ఎక్స్ ఫోర్స్ ఫీచర్లు ఇవే..

5.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ తాకే తెర, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 32జీబీ, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు, ఎస్‌డీ కార్డుతో 2టీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 21 మెగాపిక్సల్‌ రేర్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 3760 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, క్విక్ చార్జింగ్ సపోర్ట్

English summary

Motorola Company Released its new smart phone called Moto X Force in India.The price of this smartphone was Rs. 49,999 for the 32GB variant, and Rs. 53,999 for the 64GB variant.This smartphone comes with the features like 5.4-inch QHD display,3GB RAM,3760mAh battery,21-megapixel rear-camera,5-megapixel front Camera,4G ,3760mAh battery