మోటో నుంచి ఎక్స్‌ ఫోర్స్‌

Moto X Force Smart Phone

04:08 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Moto X Force Smart Phone

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ మోటో త్వరలోనే భారత మార్కెట్లోకి మోటో ఎక్స్‌ఫోర్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ని తీసుకురానుంది. ఈ విషయాన్ని సంస్థ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఫోన్‌ కొన్ని దేశాల్లో గత అక్టోబరులోనే విడుదలయింది. త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో దీని ధరపై సంస్థ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. అయితే యూకే మార్కెట్లో దీని ధర 449పౌండ్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.50,000 అన్న మాట. ప్రస్తుతం ఈ ఫోన్ నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతోంది.

ఎక్స్ ఫోర్స్ ఫీచర్ల ఇవే..

5.4 అంగుళాల తాకే తెర, క్రాక్‌ ప్రూఫ్‌ డిస్‌ప్లే, 2560×1440 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2గిగాహెడ్జ్‌ ఓక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 32జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు, 2టీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 21 మెగా పిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 4జీ సపోర్ట్‌, 3,760 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Lenovo Owned Motorola Mobile Company Recently and Lenovo Company Has Changed the name from Motorola Moto.Now this company launched a new smart phone called Moto X Force. This phione comes with the features like 5.4-inch QHD (1440x2560) display,Android 5.1.1 Lollipop and supports single-SIM with 4G LTE.The price of this phone was expected to be Rs. 53,400