బైబై మోటోరోలా.. హలో మోటో..

Motorola Name Changed As Moto

06:22 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Motorola Name Changed As Moto

ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ను రూపొందించిన కంపెనీ మోటోరోలా. మొదటి ఫోన్ రిలీజ్ చేసిన తర్వాత చాలాకాలం ఆ కంపెనీయే అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో ఉంది. అయితే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మోటోరోలా హవా బాగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్ పరుగులో వెనుకబడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ విడిపోయింది. 2012లో మోటోరోలా మొబైల్ వ్యాపారాన్ని ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంతం చేసుకుంది. అయితే గూగుల్ చేతికి వచ్చిన తర్వాత కూడా మోటోరోలా జోరు పెరగలేదు. దీంతో గూగుల్ 2014లో ఆ కంపెనీని చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవోకు అమ్మేసింది. అప్పటి నుంచి కంపెనీ దశ తిరిగింది. స్మార్ట్ ఫోన్ విభాగంలో అతి చౌకైన మోటో ఈ, ఎక్కువ ఫీచర్లతో మోటో జీని మార్కెట్ లోకి తీసుకొచ్చిన మోటో అవి రెండు సూపర్ సక్సెస్ కావడంతో మార్కెట్ లో మళ్లీ జోరు పెంచింది. ఇదే క్రమంలో పలు కొత్త ఫోన్లను, స్మార్ట్ వాచ్ లను సైతం మోటోరోలో విడుదల చేసింది. అయితే ఇంత చరిత్ర ఉన్న మోటోరోలా ఫోన్లు ఇక పై కనిపించవు. కంపెనీ మూత పడిందేమో అని అనుకుంటున్నారా.. కానే కాదు.. మోటోరోలో పేరును మోటోగా మార్చింది లెనోవో. ఇక పై ఆ ఫోన్‌ బ్రాండ్‌ మోటోగా ఉంటుంది. మోటోరోలాను మోటోగా మారుస్తున్నట్లు లాస్‌వేగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్‌-2016లో లెనోవో అధికారికంగా ప్రకటించింది.

English summary

Motorola Company has been purchased by lenovo company. Lenovo changed its name from Motorola to Moto