సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటులు

Movie names as surnames

07:02 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Movie names as surnames

మన తెలుగు సిని పరిశ్రమలో చాలామందికి సినిమా హిట్‌ అవగానే ఆ సినిమా పేరు ఇంటి పేర్లుగా మారిపోయాయి. అలాగే కొంతమందికి క్యారెక్టర్‌ నేమ్స్‌ స్థిరపడిపోయాయి..ఇలా మన తెలుగు పరిశ్రమలో సినిమా పేర్లు ఇంటి పేర్లుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖులను ఇప్పుడు చూద్దాం.

1/13 Pages

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి. ఇతడు మే 20, 1955 వ సంవత్సరంలో అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో జన్మించాడు. ఇతడు మంచి కళాపొషకుడు. కవి, రచయిత, గాయకుడు మరియు నటుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు కె. విశ్వనాధ్‌ సిరివెన్నెల చిత్రానికి పాటలు రాసే అవకాశం కల్పించారు. అప్పటినుండి ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి’గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

English summary

In this article, we have listed about Movie names as surnames. Like Bhaskar, popularly known as Bommarillu Bhaskar is a Telugu film director.