'అత్తారింటికి దారేది' పైరసీ కధతో కొత్త సినిమా

Movie on Attarintiki Daredi issue

09:35 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Movie on Attarintiki Daredi issue

ఇప్పటివరకూ సినిమాలలో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ పేరునీ, పవన్‌ డైలాగ్స్‌ నీ వాడుకున్నారు. అయితే ఇప్పుడు పవన్‌ సినిమా 'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ ఇష్యూ ని కూడా వాడేస్తున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ పై ఏకంగా సినిమా తీసేశారు. కొత్త దర్శకుడు వెంకటకృష్ణ 'ఎరుపు' అనే సినిమా తీసాడు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టీజర్ లో 'అత్తారింటికి దారేది' మెయిన్‌ సీన్లు, పవన్‌కళ్యాణ్‌ ఉద్వేగంగా ఫైరసీ చేసిన దొంగల అంతు చూస్తానని హెచ్చరించిన సీన్లూ ఉన్నాయి. ఈ టీజర్‌ చూసాక సినిమా కధ మొత్తం అత్తారింటికి దారేది పైరసీ పైనే ఆధారపడి ఉందని అనిపిస్తుంది. ఒక వేళ పవన్‌ అభిమానులను ఆకట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారేమో.

English summary

Movie on Attarintiki Daredi piracy issue. The movie name is yerupu.