సూపర్ స్టార్ కథతో సినిమా!!

Movie on Super Star life history

10:32 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Movie on Super Star life history

బస్ కండక్టర్ నుండి సూపర్‌స్టార్‌ గా ఎదిగిన రజనీకాంత్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ సూపర్ స్టార్ జీవితం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కితే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ.. అయితే ఈ కల నెరవేరబోతుంది. రజనీకాంత్‌ జీవితం ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. బెంగుళూరులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న మణిరత్నం ఈ విషయాన్ని తెలియజేశారు. 24 సంవత్సరాల క్రితం రజనీకాంత్‌-మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 'దళపతి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా రజనీకాంత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రజనీకాంతే నటిస్తారా లేదా వేరే ఎవరైనా నటిస్తారా అనే విషయాన్ని ఇంకా తెలియజేయలేదు. ఈ విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని మణిరత్నం చెప్పారు.

English summary

Star director Maniratnam want to direct movie on Super Star Rajinikanth life history.