'రోజా'పై  ఇప్పుడు  సినిమా కూడానా ....

Movie On Ysrcp MLA Roja

01:23 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Movie On Ysrcp MLA Roja

ఇప్పుడు అందరి దృష్టి వైసిపి ఎంఎల్ఎ , సినీ నటి రోజా మీదే. సినీ నటిగా కంటే , భిన్నమైన రాజకీయాల్లో 'రోజా' ఆది నుంచి సంచలనమే .... ఎదుటి వారిపై విరుచుకు పడడం, చెడా మడా తిట్టిపోయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ నోటి దురుసే ఇప్పుడు ఆమె కొంప ముంచిందని అందరూ అనే మాట.

ఓ నటిగా, ఒక పొలిటీషియన్ గా ఆమె ఫైర్ బ్రాండ్ గా నిలిచిన రోజా ప్రేమతపస్సు సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగిడి, అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. హొయలు ఒలకబోస్తూ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. తన తొలి సినిమా చంబరుతి దర్శకుడు ఆర్ కె సెల్వమణిని ప్రేమపెళ్లి చేసుకుంది రోజా. ఫిల్మ్ కెరీర్ జోరుమీదుండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రోజా, మొదటి నుంచి ప్రత్యర్థులపై విరుచుకు పడుతూ వస్తోంది.

టిడిపిలో వుండగా, కాంగ్రెస్ పై ఒంటికాలితో లేచిన రోజా ను ఏకంగా తెలుగు మహిళా అద్యక్షురాలిగా చేసారు. అన్నమయ్య నిర్మాత దొరైస్వామి రాజు ప్రాతినిద్యం వహించే నియోజకవర్గాన్ని రోజాకు కేటాయించడం , రాజు అనుచరులు దాడికి దిగినా, ధైర్యంగా ఎదిరించి , ఎన్నికల్లో పోటీచేసి , ఓటమి చెందడం పాత కధ.

దివంగత సిఎమ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకర్ష పధకంలో నోరున్న రోజా కాంగ్రెస్ వైపు అడుగులేసారు. ఇంతలోనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత జగన్ శిబిరంలో చేరిపోయారు. ఐరన్ లెగ్ అంటూ రోజా పై ప్రత్యర్ధుల విమర్శలు వున్నాయి. చట్టసభకు ఎన్నికవ్వాలన్న ఆమె కోరిక మొత్తానికి గడిచిన ఎన్నికల్లో నెరవేరింది.

చిత్తూరు జిల్లా నగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా సభా సమావేశాలలో దూకుడుగా వ్యవహరిస్తూ ,ఎదుటి అధికార పక్షం పై విరుచుకు పడుతోంది. అనుచిత వ్యాఖ్యలు దొర్లుతున్నాయి. చాలాసార్లు రోజా వ్యవహారం వివాదాస్పదమైంది. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సిఎమ్ చంద్రబాబు , తదితరులపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్సెన్షన్ కు గురయిన సంగతి ఎరుకే.

సంచలనానికి వేదిక అయిన రోజా జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. సినీరంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఘటనలను జోడించి, రోజా లైఫ్ స్టోరీకి త్వరలో చిత్ర రూపం వస్తుందని టాలీవుడ్ లో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అదే నిజమైతే, అధికారిక ప్రకటన రావడమే తరువాయి.

English summary

A news came to know that a movie to be start with the story of Ysrcp mla Roja.In that movie they were going to be show how she became MLA and others things