దానికదే కదులుతున్న శివలింగం.. తవ్వి చుసిన శాస్త్రవేత్తలకే దిమ్మతిరిగింది

Moving Shivalinga in Uttar Pradesh

10:35 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Moving Shivalinga in Uttar Pradesh

శివునికి ప్రతిరూపంగా భావించే శివలింగాలను దర్శించి పూజలు చేయడం సాధారణమే. అనాదిగా ఆచరిస్తూనే వున్నారు చాలామంది. అసలు శివలింగం అంటే ఏమిటో మనవాళ్ళు నిర్వచించారు. శివం అంటే శుభప్రథం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. ఇక దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే ఉంటాయి. దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇంకా పలు శివాలయాల్లో శివలింగ దర్శనం కోసం చాలామంది పరితపిస్తుంటారు. మంచు శివలింగం కూడా హిమాలయాలలోని క్షేత్రాల్లో వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పొతే, ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఓ చోట మాత్రం ప్రత్యేకమైన, అరుదైన శివలింగం వుంది.

బహుశా మీరు ఇదివరకెన్నడూ విని వుండరు. ఇంతకీ ఈ శివలింగం ప్రత్యేకతేమిటో తెలుసుకుందాం. ఇంతకీ ఇక్కడి శివలింగం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడున్న శివలింగం కదులుతోందంట. ఇది నూటికి నూరుపాళ్లు నిజం అని బల్లగుద్ది మరీ కొందరు చెబుతున్నారు. ఈ కదిలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ కు వెళ్లాల్సిందే.

1/5 Pages

రుద్రపూర్ లో ఎన్నో కోటలు, రాజభవంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్దేశ్వరనాథ్ ఆలయమనే చెప్పితీరాలి. ఎందుకంటే ఆలయ ప్రత్యేకతే దానిని అంత గొప్పగా మార్చేసింది. ఈ ఆలయంలోనే స్వయంభూ శివలింగం(వాటంతటవే ఉద్భవించాయి) ఏర్పడింది. భారత దేశంలోని అన్ని శివాలయాల్లో శివలింగం పానమట్టం మీద ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భూమి మీద ప్రతిష్టించబడి ఉంటుంది.

English summary

Moving Shivalinga in Uttar Pradesh