యాడ్స్ ను బ్లాక్ చేసే ఫోకస్ 

Mozilla introduced a new ad-blocker

04:44 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Mozilla introduced a new ad-blocker

మనకు నచ్చిన యాప్ ను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటాం. లేదా మొబైల్ లో మంచి గేమ్ ఆడుతుంటాం. ఇంతలో సడెన్ గా యాడ్ ప్రత్యక్షమై ఇరిటేట్ చేస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్ చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి వారి కోసమే కొత్త యాప్ ఒకటి వచ్చింది. ఫోకస్ పేరిట విడుదలైన ఈ యాప్ సహాయంతో ఈజీగా యాడ్స్ ను బ్లాక్ చేయవచ్చు. ప్రముఖ వెబ్‌బ్రౌజర్ మొజిల్లా ఈ కంటెంట్ బ్లాకింగ్ యాప్‌ని విడుదల చేసింది. సాధారణంగా యాడ్స్ కారణంగా ఇంటర్నెట్ వేగం మందగించడం లాంటి సమస్యలను వినియోగదారులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే మొజిల్లా ఈ యాప్‌ని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్, ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు నచ్చని వెబ్‌సైట్లు, ప్రకటనలు వంటి వాటిని బ్లాక్ చేయాలనుకుంటే ఈ యాప్ ద్వారా వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

English summary

Mozilla has launched a free content blocker for Safari users on Apple’s iOS 9 operating system.With the use of this app we can block adds while we are playing games,surfing internet etc