ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌కు గుడ్ బై

Mozilla Stopped its Firefox OS

04:49 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Mozilla Stopped its Firefox OS

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ మొజిల్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓఎస్ ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. వినియోగదారుల నుంచి అంతంత మాత్రం స్పందన ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మొజిల్లా ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు మాత్రం ఈ ఓఎస్ అందుబాటులోనే ఉంటుంది. వారు దీన్ని తమ ప్రయోగాల కోసం ఉపయోగించుకోవచ్చు.

2013లో ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌ను మొజిల్లా ప్రవేశపెట్టింది. దీనిని బేస్ చేసుకుని అనేక మొబైల్స్, పీసీలు కూడా రిలీజ్ అయ్యాయి. స్పైస్ ఫైర్ వన్ ఎంఐ-ఎఫ్‌ఎక్స్2, ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ సి, ఆల్కాటెల్ ఆరెంజ్ కిల్ఫ్, ఇంటెక్స్ క్లౌడ్ ఎఫ్‌ఎక్స్, ఫైర్‌ఫాక్స్ యూ105, ఎల్‌జీ ఎఫ్‌ఎక్స్ మొదలైన తక్కువ బడ్జెట్ ఫోన్లు ఇలా మార్కెట్‌లోకి వచ్చినవే. దీంతోపాటు పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా ఫైర్‌ఫాక్స్ ఓఎస్ ఆధారిత 'హెచ్‌డీ టీవీ'లను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టాయి. అయితే ఈ ఉత్పత్తులకు అంతగా ఆదరణ లభించలేదు. దీనికి తోడు స్మార్ట్ ఫోన్ విభాగంలో మొజిల్లా షేర్ గత నెలలో బాగా తగ్గిపోయింది. దీంతో ఆ ఓఎస్‌కు తెర దించాలని మొజిల్లా నిర్ణయించింది.

English summary

Mozilla's Firefox OS was introduced in 2013.This os came with several low-budget smartphones.Now mozilla stopped its fiirefox operating system