పవర్ స్టార్ కి గట్టిగా ఇచ్చుకున్న ఎంపీ అవంతి

MP Avanthi fires on Pawan Kalyan

04:33 PM ON 29th August, 2016 By Mirchi Vilas

MP Avanthi fires on Pawan Kalyan

ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలపై పవన్ కల్యాణ్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కోపం చిర్రెత్తుకొచ్చింది. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పదవులు తమకు గడ్డిపరకతో సమానమని తేల్చిచెప్పారు. ఎంపీలను ధనవంతులనడం సరికాదని అవంతి పేర్కొంటూ, కష్టపడి పైకొచ్చామని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ లా తాము గోల్డెన్ స్పూన్ తో తాము పుట్టలేదని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పవన్ తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ప్రత్యేకహోదా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే, విషయం అర్ధం అవుతుందన్నారు. ప్రధాన మంత్రిని సార్ అనకపోతే ఏమనాలని అవంతి ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: తాను మునిగిపోతూ కొడుకు ప్రాణాలు కాపాడిన గొప్ప తల్లి

ఇది కూడా చదవండి: ఉదయ భానుని అవమానించిన సింగర్ ఎవరు?

ఇది కూడా చదవండి: పెళ్ళిలో సందడి చేసిన చైతూ-సమంత జంట(ఫోటోలు)

English summary

MP Avanthi fires on Pawan Kalyan.