బెంబేలెత్తించిన ఎంపీ గోకరాజు విన్యాసాలు

MP Gokaraju Gangaraju swimming in river

03:38 PM ON 1st August, 2016 By Mirchi Vilas

MP Gokaraju Gangaraju swimming in river

గోదావరి ఫుల్లుగా వుంది. సుడులు తిరుగుతూ, మాంచి ఊపు మీదుంది. సరిగ్గా అంత్య పుష్కరాలు వచ్చేసాయి. దీంతో నాసాపురం బిజెపి ఎంపీ గోకరాజు గంగరాజు(68) అదివారం వశిష్ఠ గోదావరిలో పుష్కర పుణ్య స్నానం చేశారు. అయితే బయటకు రాకుండా, నదిలో ఈత కొడుతూ విన్యాసాలు చేశారు. నీటి ప్రవాహం స్పీడ్ గా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఈత కొడుతూ మధ్య మధ్యలో ఆసనాలు, విన్యాసాలు, సూర్య నమస్కారాలు చేశారు. చూపరులను విశేషంగా అలరించాయి. అయితే గట్టు మీద ఉన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు, ఇతర అధికారులకు ఒకటే టెన్షన్.

ఒకానొక దశలో గజ ఈతగాళ్లను ఆయన వద్దకు పంపించారు. నిజానికి ఎంపీ గోకరాజు గంగరాజు ఈతలో ప్రావీణ్యం వున్నా, గోదావరి ఉదృతి చూసి, అంతా కంగారు పడ్డారు.

English summary

MP Gokaraju Gangaraju swimming in river