హేమామాలిని తీరుపై దుమారం

MP Hema Malini was uploading shoot pics when Mathura Was Burning

06:17 PM ON 4th June, 2016 By Mirchi Vilas

MP Hema Malini was uploading shoot pics when Mathura Was Burning

రోం నగరం తగలబడి పోతుంటే, నూరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నట్లు విన్నాం ... కానీ ఇప్పటి సెలబ్రిటీ లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నకై ఏమి చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. ప్రజాసేవ చేస్తామంటూ తెగ ఉత్సాహంగా వచ్చే సెలబ్రిటీలు రాజకీయంగా ఎంతలా సేవ చేస్తారో చాలా మంది ప్రముఖులు చేతల్లో చేసి చూపించారు. అయితే పదవిని హోదాగా ఎంజాయ్ చేయటమే తప్పించి.. బాధ్యతగా ఫీల్ కాని ప్రముఖులు ఎలా వ్యవహరిస్తారో తాజా ఉదంతం మరోసారి చెబుతోంది. పార్కుకు సంబంధించిన భూమిని ఆక్రమించిన వారిని తొలగించే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ లోని మధురలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగిన సంగతి తెల్సిందే.

కోర్టు ఆదేశాల మేరకు భూఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేసిన పోలీసులపై నిరసనకారులు దాడులకు దిగటంతో పెద్ద ఎత్తున హింసాకాండకు దారి తీసింది. ఈ ఘటనలో ఒక ఎస్పీ.. ఒక ఎస్ ఐతో సహా మొత్తం 21 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 200 పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంటే.. ఆ నియోజకవర్గానికి ఎంపీగా వున్న ప్రముఖ సినీ నటి హేమమాలిని ఒక షూట్ లో బిజీగా ఉన్నారట.

షూట్ లో వున్నా తప్పుకాదు ... కానీ తన నియోజక వర్గంలో జరిగే విషయాలను ఏమాత్రం పట్టకుండా తన షూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట. ఈ విషయంపై ఒక న్యూస్ ఏజెన్సీ వార్తగా వెలుగులోకి తీసుకురావటం, అప్పటికే సోషల్ మీడియాలో హేమమాలిని వైఖరిపై తీవ్రనిరసన వ్యక్తం కావటంతో హేమమాలిని తాను చేసిన తప్పును గుర్తించారు. వెంటనే.. తన పోస్టింగ్స్ ను తొలగించి.. మధుర ప్రజలు శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ పని చేసుకునే వారు ఆ పని చేసుకుంటేనే ఉత్తమన్న విమర్శలు హేమమాలిని లాంటి వారి పుణ్యమా అనే పుడతాయి మరి.

ఇవి కూడా చదవండి:అమ్మాయి కాదందని ఆమె తల్లి పై కత్తితో దాడి.. ఆ పై..(వీడియో)

ఇవి కూడా చదవండి:జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

English summary

MP Hema Malini was uploading shoot pics when Mathura Was Burning. Sghe posted her shoot pics on twitter.