చంద్రబాబు వల్లే టిడిపి అధికారంలోకి రాలేదన్న జేసీ

MP JC Diwakar Reddy Sensational Comments On Chandrababu

10:50 AM ON 21st December, 2016 By Mirchi Vilas

MP JC Diwakar Reddy Sensational Comments On Chandrababu

మిగిలిన నాయకులకు అనంతపురం టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డికి చాలా తేడా వుంది. తాను అనుకుంటున్న విషయాన్ని కుండబద్దలు కొట్టే సీనియర్ పొలిటీషిన్ అయిన ఎంపి.. దివాకర్ రెడ్డి ఎలాంటి విషయంపై నైనా గట్టిగానే స్పందిస్తారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని.ఆయన స్పష్టం చేసారు. పైగా దాని వెనుక చాలా మంది కష్టం ఉందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరగదని ప్రజలు భావించారని, అందుకే అప్పటి పరిస్థితులను బట్టే తాను టీడీపీలో చేరానని దివాకర్ రెడ్డి అన్నారు. అంతేకాదు, పిలవగానే జనాలంతా వచ్చేయడానికి చంద్రబాబేమీ మహాత్మాగాంధీ కాదంటూ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ. చంద్రబాబు అధికారులతో పాలిస్తున్నారని... అధికారుల రాజ్యం వద్దని ఆయనకు చాలా సార్లు చెప్పానని... ఆయన వినడం లేదని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి అనంతపురం ఎంపీగా గెలిచిన జేసీ, ఇప్పుడు స్వంత పార్టీ అధినేతమీదే వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెరెలేపారు.

ఇవి కూడా చదవండి: పవర్ స్టార్ పై కేసు నమోదు .. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి: అబ్బో, ... ఆ హీరోయిన్ మదర్ ని చూస్తే మతిపోద్ది

English summary

Ananthapuram MP JC Diwakar Reddy made some controversial and sensational comments on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Vijayawada.