ఛీ ఛీ ... ఆ ఎంపీ కాల్ బాయ్స్ తో రాసలీలలు

MP Keith Vaz Caught with Call Boys

10:25 AM ON 7th September, 2016 By Mirchi Vilas

MP Keith Vaz Caught with Call Boys

ఏ దేశం లోనైనా అన్ని రంగాల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. రాజకీయ నేతల వ్యవహారం అలానే వుంది. సభ్య సమాజం సిగ్గుపడే చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ చట్టసభ సభ్యుడు కెయిత్ వాజ్ కాల్ బాయ్స్ తో రాస లీలలు జరిపారని పలు విమర్శలను ఎదుర్కొని చివరకు తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాడు. సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో అతడిపై పలు రూమర్లు దుమారం రేపాయి. వివరాల్లోకి వెళ్తే, గత చాలా కాలంగా బ్రిటన్ లో చట్టసభలో ఎంపీగా కొనసాగుతున్న కెయిత్ వాజ్(59) అనే వ్యక్తి లైంగిక వాంచలు తీర్చే మేల్ సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించారని సండే మిర్రర్' పత్రికలో కథనం వెలువడింది. బ్రిటన్ లో నిషేధించిన ఉత్ప్రేర కాలు కూడా ఆయన కొనుగోలు చేసినట్లు సదరు కథనంలో ఆ పత్రిక స్ప ష్టం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలగారు.

బ్రిటన్ లో లైసిస్టర్ ప్రాంతం నుంచి 1987 నుంచి ఎంపీగా కెయిత్ వాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెలలో లండన్ లోని తన ఫ్లాట్ కు ఇద్దరు కాల్ బాయ్స్ ను పిలిపించుకున్నాడని సండే మిర్రర్ ప్రచురించింది. దీంతో త్వరలోనే తాను హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఇందులో ఆయన పదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు.

నా చర్యలతో తీవ్రంగా గాయపడిన, ఇబ్బందిపడిన నా భార్య, పిల్లలకు, మొత్తం కుటుంబానికి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నా. ఈ విషయాల పై మంగళవారం విచారణ కమిటీ ముందు హాజరై పూర్తి వివరణ ఇస్తా అని కెయిత్ చెప్పాడు.

మొత్తం రెండుసార్లు కెయిత్ ఈస్ట్రన్ యూరోపియన్ కు చెందిన ఆ ఇద్దరితో 90 నిమిషాలపాటు సమావేశం అయ్యాడట. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చిందట. ఆ రోజు ఆయన వారికి పంపించిన ఎస్సెమ్మెస్ లో కొన్ని పరిశీలిస్తే.. రాత్రి 11 అయింది. నైస్.. కానీ బాగా ఆలస్యం. నాకు మంచి విడుపు కావాలి ప్లీజ్ అంటూ ఉన్నాయి. ఈ విషయం ఇప్పుడు బ్రిటన్ లో పెద్ద హాట్ టాపిక్ గా అయింది.

ఇవి కూడా చదవండి: రాహుల్ సభలో మంచాలు ఎత్తుకుపోయారు!

ఇవి కూడా చదవండి:ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడ్డం నేరం కాదన్న కోర్టు!

English summary

Indian Origin named Keith Vaz was working as a MP in Britain from 1987 on wards. Recently a leading news paper in Britain published the secrets of him and it published that MP have met call boys in different places . Now this become hot topic in Britain.