అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో  ఎంపీ నాని కూతురు ...

MP Kesineni Nani Daughter Participating in America Election campaign

10:15 AM ON 8th March, 2016 By Mirchi Vilas

MP Kesineni Nani Daughter Participating in America Election campaign

అవునా, అంటే అవుననే వినిపిస్తోంది. తండ్రి ఏపీలో కీల‌క‌మైన లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీగా ఉంటే కుమార్తె ఏకంగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి దిగింది. టీడీపీ ఎంపీ కుమార్తె తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని బానే వంట బట్టించుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో హిల్లరి క్లింటన్‌ తరపున విజయవాడ అమ్మాయి ప్రచారం చేస్తోంది. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరి ప్రచార బాధ్యతలు నిర్వహించే కీలక బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ద్వితీయ కుమార్తె శ్వేతాచౌదరి సభ్యురాలుగా ఉంది. కొన్నేళ్లుగా అమెరికాలో విద్యను అభ్యసిస్తోన్న శ్వేత 2014 ఎన్నికల్లో విజయవాడలో నాని తరపున ప్రచారం చేసింది. నాన్న గెలుపులో భాగం పంచుకున్న శ్వేత ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేస్తూ , హిల్లరి గెలుపునకు బాటలు వేస్తుందా ... చూద్దాం.

English summary

Vijayawada MP Kesineni Nai's Second daughter Swetha Chowdary was Participating in America Election campaign. She was the participating in election campaign for Democratic party Candidate Hillari.She also participated in 2014 election campaign in Andhra Pradesh.