రాయపాటిపై 'దాడి' 

M.P Rayapati Contreversial Words

12:05 PM ON 9th January, 2016 By Mirchi Vilas

M.P Rayapati Contreversial Words

తెలుగుదేశం పార్టీలో కూడా కాంగ్రెస్ మాదిరిగానే తలో మాటా మాట్లాడేస్తున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైతే పూర్వపు వాసనలు పోవడం లేదు. పార్టీ వేదిక మీద ఇండోర్ లో మాట్లాడవలసిన మాటలు మీడియా ఎదుట కక్కేస్తున్నారు. దీంతో టిడిపి సీనియర్ నేతలకు ఇబ్బంది కరంగామారింది. తాజాగా టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే ,

రెండు రోజులక్రితం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జిఎమ్ ఎంపిలతో ఏర్పాటుచేసిన సమావేశం నుంచి టిడిపి ఎంపి లు వాకౌట్ చేసారు. చిన్న చిన్న పనులు కూడా పరిష్కారం కానప్పుడు సమావేశం ఎందుకని టిడిపి ఎంపి లు మీడియా ఎదుట అధికారుల తీరుని తప్పు బట్టారు. అంతవరకూ బానే వుంది. అయితే ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావు పేట ఎంపి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ' తీర ప్రాంతం కారణంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అందుచేత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అవసరం లేదు. ఇప్పటికే హూదూద్ తుపాన్ వలన విమానాశ్రయానికి దెబ్బ తగిలింది' అంటూ ఎంపి రాయపాటి వ్యాఖ్యానించారు. గుంటూరు , విజయవాడ రైల్వే జోన్ ఇవ్వాలని అన్నారు. విశాఖ ఎంపి డాక్టర్ కె హరిబాబు తో పాటు పలువురు ఎంపి లు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో
రాయపాటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మాజీ మంత్రి దాడి వీర భద్రరావు సీరియస్ గా స్పందిస్తూ , విశాఖ రైల్వే జోన్ అవసరం లేదంటూ రాయపాటి చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితమని, పైగా ఉత్తరాంధ్ర ను అవమానించేలా ఈ వ్యాఖ్యలు వున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేసారు. కృష్ణా నదికి వరదలు ఉప్పెనలు రాలేదా? అన్నీ మరిచి మాట్లాడుతున్నారా? వాస్తవానికి విశాఖ నుంచి ఏటా 6200కోట్ల రూపాయల ఆదాయం రైల్వే కు సమకూరుతుంటే , విజయవాడ నుంచి 3200కోట్లు, గుంటూరు నుంచి కేవలం 500 కోట్లు వస్తున్నాయని దాడి వీరభద్రరావు గణాంకాలు వివరించారు. పైగా విశాఖలో రైల్వే శాఖకు 808 ఎకరాల స్థలం కూడా వుందని ఆయన పేర్కొంటూ , రైల్వే జోన్ విభాగాలన్నీ ఏర్పాతుచేసుకోవచ్చని అంటున్నారు.

మొత్తానికి టిడిపి ఎంపి చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర నేతలకు ఆగ్రహం కల్గిస్తోంది. ఇప్పటికే టిడిపి నేతలు ఆయా సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలతో సిఎమ్ చంద్రబాబుకి ఇబ్బంది కల్గిస్తుంటే , తాజాగా ఎంపి రాయపాటి వ్యాఖ్యలు ఇరకాటంలో నెడుతున్నాయి.

English summary

Narasaraopet Mp TDp Leader Rayapati Sambha Shiva Rao said that there is no need of Special Zone for Vishkapatnam. This was opposed by Ex-Minister Daadi Veerabadra Rao