పెళ్ళైన 26 ఏళ్ళ తర్వాత విడాకుల నోటీసు

MP Sathyabama get divorce notice from her husband

12:58 PM ON 16th August, 2016 By Mirchi Vilas

MP Sathyabama get divorce notice from her husband

సాధారణంగా 7 ఏళ్ళు సక్రమంగా కాపురం ఉంటే, అది నిలబడినట్టేనని అంటారు. ఎందుకంటే ఈలోగానే ఎన్నో ఆకర్షణలు, ఎవరో తగులుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏకంగా పెళ్లయిన 26 ఏళ్ళ తర్వాత, భార్యకు విడాకుల నోటీసు ఇచ్చాడు ఓ భర్త. పైగా ఆవిడ గారు ఎంపీ కూడానూ. అధికార పార్టీ కూడా. తమిళనాడుకి సంబంధించిన ఈ అరుదైన కేసు వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికిఅన్నాడీఎంకే ఎంపీలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎంపీ శశికళ పుష్ప వివాదం ఇంకా సద్దుమణగక ముందే తిరుప్పూర్ అన్నాడీఎంకే ఎంపీ సత్యభామ వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్నారు. సత్యభామకు భర్త విడాకుల నోటీసు జారీ చేశారు.

1990లో గోపిశెట్టిపాళయం సమీపంలోని ఎలందక్కాడు ప్రాంతానికి చెందిన వాసు - సత్యభామ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి వసంత(24) అనే కుమారుడున్నాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో సత్యభామ అన్నాడీఎంకే తరపున తిరుప్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం భార్యాభర్తల మధ్య విభేధాలు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాసు తరపున ఆయన న్యాయవాది జాఖీర్ హుస్సేన్ ద్వారా ఎంపీ సత్యభామకు విడాకుల నోటీస్ అందింది. దీనిపై వాసు మాట్లాడుతూ, 1990 మార్చి 30న సత్యభామకు, తనకు వివాహం జరిగిందని, అయితే ఆమె ఇటీవల కుటుంబం గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ మధ్య సత్సంబంధాలు లేనందువల్లే తాను ఆమె నుంచి విడాకులు కోరుకుంటున్నట్టు చెబుతున్నాడు.

English summary

MP Sathyabama get divorce notice from her husband