ప్యాకేజి ని డబ్బా పాలతో పోల్చిన ఎంపీ శివప్రసాద్

MP Siva Prasad Comments On Special Package To AP

11:06 AM ON 15th September, 2016 By Mirchi Vilas

MP Siva Prasad Comments On Special Package To AP

ఏపీకి హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం, అందుకనుగుణంగా టిడిపి ప్రభుత్వం కూడా ఒదిగిపోవడం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ, టిడిపి నేత డాక్టర్ శివప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు. 'ప్రత్యేక హోదా తల్లిపాలు లాంటివి. ప్రత్యేక ప్యాకేజీ డబ్బాపాలు లాంటివి' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. తల్లిపాలు లేక ఆకలితో అలమటిస్తున్న బిడ్డకు డబ్బాపాలు అవసరమా? అనే ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీపై ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని.. దీనిపై ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. సమైక్యాంధ్ర సమయంలో తాను, ప్రజలు ఎంత పోరాడినా విభజన ఆగలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసినా, వీలుకాని పక్షంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తారని ఆయన తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ, హోదాపై సాగిన ఆందోళన సందర్బంగా కూడా వివిధ వేషాలతో డాక్టర్ శివప్రసాద్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: అందాలు ఒలకబొయ్యడంలో రష్మీని మించిపోయిన శ్రీముఖి(ఫోటోలు)

ఇవి కూడా చదవండి:మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్స్ ఇవే.. విమానాలు కూడా ఈ ట్రైన్స్ ముందు వేస్టే!

English summary

Chittoor TDP MP Siva Prasad was known for his different type of acts and now he made some comments on Special Package that was announced by Central BJP Government. He said that Special Status was mother milk and special package was like Tin Milk. He also said that he will trust Chandrababu Naidu will develop AP with the Special Package.