ఎంపీలు వారంపాటు నియోజకవర్గాల్లో ఉండాల్సిందే

MPs Have To Spend One Week In Their Constituencies

11:05 AM ON 11th May, 2016 By Mirchi Vilas

MPs Have To Spend One Week In Their Constituencies

పార్లమెంటేరియన్లు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి నేతలకు సూచించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మోడీ బిజెపి నేతలతో సమావేశమయ్యారు. వారికి పలు విషయాలపై మోడీ మార్గదర్శకాలు సూచించారట. అలాగే ఏడు రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో ఉండి రాత్రి కూడా అక్కడే బస చేసి సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలకు మరింత దగ్గరవ్వాలని మోడీ ఎంపీలను ఆదేశించారు. బిజెపి ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రజలతో చర్చించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రచారం చేయాలని మోదీ సూచించారు. అలాగే ప్రజల స్పందన, వారు ఏం కోరుకుంటున్నారో జాబితా తయారుచేసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనలను తిరిగి మోదీకి తెలియజేయాలని సూచించినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. కాగా మే 26వ తేదీకి ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. మంత్రులు దేశ వ్యాప్తంగా 200 ప్రదేశాలు సందర్శించి తమ తమ విభాగాలు సాధించిన విజయాలు, ప్రజల ఫిర్యాదుల గురించి తెలుసుకోనున్నారని మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ వెల్లడించారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:నన్ను చంపేస్తారు అంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

ఇవి కుడా చదవండి:అమెరికాలో సూర్య 24 భారీ వసూళ్లు

English summary

Prime Minister Of India Narendra Modi advised MP's to spend One Week in their Own Constituencies and know the problems and needs of them. Narednra Modi suggested because of NDA government was completing 2 years and aksed MP's to give a detailed list of what people need.