మన్మధన్ ఫర్ సేల్

Mr Manmadhan For Sale Trailer

12:15 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Mr Manmadhan For Sale Trailer

డిఫరెంట్ ఏజ్ లను దృష్టిలో ఉంచుకుని న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీల పేరుతో దర్శకులు ఈమధ్య తీస్తున్న సెమీ శృంగార చిత్రాలకు భాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేస్తున్నాయట. పైగా ఆ మధ్య వచ్చిన త్రిష లేదా నయనతార చిత్రం బాగా వర్కవుట్ అవటంతో మరో తమిళ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. శింబు, వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్ లో 2012 లో వచ్చిన 'పోరా పోడి' చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉండేలా మిస్టర్ మన్మధన్ ఫర్ సేల్ అని పెట్టారు. ఈ చిత్రం ట్రైలర్ ని వదిలారు. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి. ఈ ట్రైలర్ లో శింబు రెచ్చిపోయి, డైలాగులు చెప్తూ కనిపిస్తాడు. ఈ ట్రైలర్ ద్వారా ఖచ్చితంగా బిజినెస్ అవుతుందనే భావించి విడుదల చేసారు తెలుగు నిర్మాతలు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. అఫ్ కోర్స్ ఈ చిత్రం తమిళనాట ప్లాప్ అయిపొందనుకోండి.

శింబుకు బీప్ సాంగ్ తో క్రేజ్ రావటంతో ఒక్కసారిగా ఇక్కడ కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు. దాంతో శింబు గతంలో ఎప్పుడో వచ్చిన మన్మధ చిత్రం హిట్ కావటంతో సుబ్రమణ్యం ఫర్ సేల్ టైటిల్ ని మిక్స్ చేసి, మిస్టర్ మన్మధ ఫర్ సేల్ అని కిక్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్న నిర్మాతల పంట పండుతుందో లేదో చూడాలి.

English summary

Tamil Young Hero Simbu's Tamil Movie "Pora Podi" movie was dubbed it to Telugu.Yesterday that movie trailer was launched by the movie unit.Intresting fact that this movie was flop in Tamil.