ధోనీ ఉన్న టీమే ఫేవరెట్: గవాస్కర్

MS Dhoni team Pune was favourites in IPL

07:05 PM ON 16th December, 2015 By Mirchi Vilas

MS Dhoni team Pune was favourites in IPL

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పుణే జట్టు కెప్టెన్ గా నియమిస్తే ఆ జట్టే ఫేవరెట్ అని టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పుణెకు ధోనీ ఉండటంతో ఆ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తోందని చెప్పాడు. ధోనీ ఏ టీమ్ లో ఉన్నా అది ఫేవరేట్ అని, కొత్త జట్టుకు మహీ వంటి ఆటగాడు అవసరమని, భారత క్రీడల్లో ధోనీ అతిపెద్ద బ్రాండ్ అని కితాబిచ్చాడు. రాజ్ కోట్ తో పోలిస్తే పుణె కాస్త బలోపేతంగా కనిపిస్తోందని చెప్పాడు. రాజ్ కోట్ కెప్టెన్ గా భారత క్రికెటర్ నే నియమించాలని సూచించాడు. స్థానిక ఆటగాళ్ల ప్రతిభ గురించి భారత ఆటగాడికే బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రాజ్ కోట్ జట్టుకు భారత క్రికెటర్ కెప్టెన్ గా ఉండాలి. అతనికి స్థానిక ఆటగాళ్ల బలాలు, బలహీనతలు తెలుసు. కోచ్ గా భారతీయుడు అవసరమైతే.. కెప్టెన్ గా బ్రెండన్ మెకల్లమ్ ను నియమించుకోవచ్చు' అని సన్నీ అన్నాడు. వచ్చే రెండు సీజన్ల కోసం రాజ్ కోట్ తో పాటు పుణె జట్లను ఐపీఎల్ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా వేలంలో రాజ్ కోట్.. సురేష్ రైనా, లోకల్ హీరో రవీంద్ర జడేజాతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ ను దక్కించుకుంది.

English summary

Sunil Gavaskar Says That Dhoni's led tead punewas the favourite team in upcoming IPL Season