తెలుగోడికి దక్కిన అరుదైన గౌరవం..

MSK Prasad was elected as a BCCI chief selector

05:28 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

MSK Prasad was elected as a BCCI chief selector

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా తెలుగుతేజం ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికయ్యాడు. భారత మాజీ వికెట్ కీపర్ అయిన ప్రసాద్ ను నూతన సీనియర్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్ గా బోర్డు ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఇప్పటిదాకా సెలెక్టర్ గా ఉన్న ప్రసాద్ కు ప్రమోషన్ ఇచ్చింది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ స్థానంలో ఎమ్మెస్కేను నియమిస్తూ బుధవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయం తీసుకుంది.

1/4 Pages

తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు...


దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన తొలి వ్యక్తిగా ప్రసాద్ రికార్డు నెలకొల్పాడు. గతేడాది జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన ఎమ్మెస్కే.. ఆంధ్ర క్రికెట్ సంఘం(ఏసీఏ) క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఆరేళ్ల పాటు సేవలందించాడు. ఇక, సీనియర్ సెలెక్షన్ ప్యానెల్ సభ్యులుగా గగన్ ఖోడా, దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపె, శరణ్ దీప్ సింగ్ లను బీసీసీఐ ఎంపిక చేసింది. లోథా కమిటీ సిఫారసులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ అనుభవం ఉన్న వారినే సెలెక్షన్ కమిటీలోకి తీసుకుంది. ఇక భారత మాజీ సీమర్ వెంకటేష్ ప్రసాద్ ను జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా కొనసాగించింది.

ఎమ్మెస్కే కంటే ఎక్కువ అనుభవం ఉన్న వెంకీ కూడా సీనియర్ సెలెక్షన్ కమిటీ చీఫ్ పదవి రేసులో నిలిచాడు. అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అండగా నిలవడంతో చివరికి ఎమ్మెస్కేనే కీలక పదవి వరించింది. ఇక, బోర్డు కార్యదర్శిగా అజయ్ షిర్కేను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఏజీఎం తీర్మానం చేసింది. కాగా, లోథా సిఫారసుల అమలుపై చర్చించేందుకు ఈనెల 30న ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏజీఎం నిర్ణయించింది.

English summary

MSK Prasad was elected as a BCCI chief selector