రోజా "మగాళ్ళ" టెస్టింగ్ ఎజెన్సీయా!

Muddu Krishnama Naidu Fires On Roja

06:25 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Muddu Krishnama Naidu Fires On Roja

ఓ పక్క వైసిపి ఏంఎల్ఎ , నటి రోజా , మరో పక్క టిడిపి నేతల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. టిడిపిలో మగాళ్ళు లేకనే , తమ పార్టీ వాళ్ళను చంద్రబాబు చేర్చుకుంటున్నారని రోజా ఘాటైన వ్యాఖ్యలు చేయగా, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు దీటుగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎక్కడ ఉన్నా ఐరన్‌ లెగ్‌ని, ఆ విషయం అందరికి తెలుసునని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, రోజాను వైసీపీ ఎంతకు కొన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలో మగాళ్లు లేరని రోజా అంటున్నారని, రోజా ఎమైనా టెస్టింగ్‌ ఏజెన్సీ పెట్టారా? అని ముద్దుకృష్ణమ నాయుడు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆడ- మగ తేడా లేదని, అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు.

English summary